![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -423 లో....రుద్రాణి, మాయలు బాబుని హ్యాండిల్ చెయ్యలేకపోతారు. బాబు ఏడుస్తుంటే చిరాకుపడతారు. అప్పుడే స్వప్న వచ్చి.. దున్నపోతుల్లా ఇద్దరున్నారు.. బాబుని ఎందుకు ఏడిపిస్తున్నారని అడుగుతుంది. వాడే ఏడుస్తున్నాడని వాళ్ళు చెప్పగానే.. పాలు పట్టొచ్చు కదా అని స్వప్న అంటుంది. నీకు డిస్టబ్ కాదు నువ్వు వెళ్ళు ఎలాగోలా బాబుని పడుకోపెడతామని రుద్రాణి అంటుంది.
ఆ తర్వాత మరుసటి రోజు అందరూ హాల్లోకి వస్తారు. రోజు ఈ పంచాయతి ఏంటని అపర్ణని రుద్రాణి అడుగుతుంది. నీ భర్త నుండి విడిపోవడానికి విడాకులు ఇవ్వనని చెప్పావ్.. ఇప్పటికి అదే మాట మీద ఉన్నావా అని అపర్ణ అడుగుతుంది. మాట మార్చుకోవడానికి ఇది వ్యాపారం కాదు సంసారమని కావ్య అంటుంది. అలా అని ఇంటి నుండి వెళ్లడానికి ఇష్టం పడడం లేదని అపర్ణ అంటుంది. లేదు నా భర్త ఉన్న ఇల్లే నా ఇల్లు అని కావ్య అంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పేదానికి ఒప్పుకోవాలి. నా కొడుకు మాయని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే అన్నట్టు.. ఈ నో ఆబ్జెకన్ పేపర్ పై సంతకం పెట్టమని అపర్ణ అనగానే.. అందరు షాక్ అవుతారు. నువ్వు ఎటు తిరిగి కావ్యకి అన్యాయం చెయ్యాలనుకుంటున్నావ్ కదా అని సుభాష్, ప్రకాష్, కళ్యాణ్ లు అంటారు.. నేను కావ్యని నా కొడుకుకి విడాకులిచ్చి.. నీ బ్రతుకు నువ్వు బ్రతుకమని అన్నాను.. దానికి ఆమె ఒప్పుకోలేదు.. ఒప్పుకోమని నేను బలవంతం చెయ్యలేదు. ఆ బిడ్డ తల్లి ఎదరుగా ఉంది ఆమెకి న్యాయం చెయ్యడానికి.. ఇదొక్కటే మార్గం అనుకుంటున్నానని అపర్ణ అంటుంది. ఆ బిడ్డకి వారసత్వం కల్పించి రాజ్ , మాయలకి పెళ్లి చెయ్యాలని నిర్ణయం తీసుకున్నానని అపర్ణ అంటుంది. దానికి కావ్య ఒప్పుకున్న గానీ నాకు అంటు అభిప్రాయం నిర్ణయం ఉంటుంది కదా.. నన్ను అడగక్కర్లేదా అని రాజ్ అనగానే.. నువ్వు మాట్లాడే అర్హత కోల్పోయావని అపర్ణ అంటుంది.
ఆ తర్వాత ఇప్పుడు వద్దని చెప్తే.. మాయని ఎందుకు తీసుకొచ్చావని అడుగుతారు. అప్పుడు నిజం బయటపడుతుంది. ఇప్పుడు సంతకం పెట్టి ఎలాగ టైమ్ ఉంటుంది. గనుక ఆ లోపు ఈ మాయ సంగతి చెప్పొచ్చని కావ్య అనుకొని.. నేను సంతకం పెడుతానని అనగానే అందరు షాక్ అవుతారు. కావ్య సంతకం పెడుతుంది. ఇన్ని రోజులు రుద్రాణి అంటే నమ్మలేదు.. కేవలం నువ్వు ఆస్తి కోసం మాత్రమే ఆలోచిస్తావ్.. ఇప్పుడు భర్తని కూడా వద్దనుకున్నావని కావ్యని అపర్ణ తిడుతుంది. బాగా చెప్పావని ఇందిరాదేవి అంటూ వస్తుంది. తరువాయి భాగంలో అసలు నువ్వు ఎందుకిలా చేస్తున్నావని కావ్యని రాజ్ అంటాడు. టైమ్ ఉంది కదా ఈలోపు నిజం తెలుసుకొని బయటపెట్టాలని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |